Butchaiah Chowdary: లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

  • లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్..
  • ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు..
  • చంద్రబాబు సీఎంగా ఉండగా మరోకరికి ఆలోచన లేదు..
  • డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు..
  • లోకేష్ డిప్యూటీ సీఎం వాదన సరికాదు..
Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Butchaiah Chowdary: మంత్రి నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్‌ వినిపించింది.. క్రమంగా పలువురు టీడీపీ నేతలు ఈ అంశంపై స్పందించడం.. అదే స్థాయిలో జనసేన నుంచి.. సోషల్‌ మీడియాలో కౌంటర్‌ ఎటాక్‌ జరగడంతో.. టీడీపీ ఆ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చింది.. మరోవైపు.. జనసేన నుంచి కూడా అదే తరహా ఆదేశాలు వచ్చాయి.. అయితే, లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సాగుతున్న చర్చపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై బుచ్చయ్య చౌదరి స్పందించారు.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరికి ఆలోచన లేదన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ ఉన్నారని అన్నారు.. అయితే, లోకేష్‌ టీడీపీ కోసం కష్టించి పని చేశారని, దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు సముచిత స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకానీ, లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన టీడీపీ నాయకులు చేయడం సరికాదని సూచించారు రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Read Also: Tollywood : టాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్టుల్లో బాలీవుడ్ భామలు