లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సాగుతున్న చర్చపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై బుచ్చయ్య చౌదరి స్పందించారు.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరికి ఆలోచన లేదన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారని అన్నారు..
కలకలం సృష్టించిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్‌లా ముగిసింది… అసంతృప్తితో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య చౌదరి గత నెలలో సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. దీంతో బుచ్చయ్య చౌదరితో తెలుగుదేశం నాయకత్వం సంప్రదింపులు జరిపింది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాతో భేటీ అయ్యారు బుచ్చయ్య చౌదరి.. దీంతో.. బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారానికి పులిస్టాప్ పడిపోయింది.. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి.. వైసీపీ…