Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. పులివెందుల, ఒంటిమెట్టలలో రీ పోలింగ్ జరపాలి.. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది.. కానీ, పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు కూడా రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు అని ఆరోపించారు. దొంగ ఓట్లకు సంబంధించిన సాక్ష్యాలు ఎన్నికలు కమిషన్ ముందు పెట్టినందున పరిశీలించి రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా, ఎన్నికల కమిషన్ తమ విదానాన్ని మార్చుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
Read Also: HCA: బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ. 240 కోట్లు.. 20 రోజుల్లో రూ. 200 కోట్లు మాయం..!
ఇక, ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ లో భార్య, కుమారుడు, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ కలిశారు. రాజకీయ కక్షలతోనే ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఉన్న రాజకీయ వైర్యమే కారణం.. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయటం ఫ్యాషన్ గా మారింది.. వ్యక్తిగత కక్షలకు పోతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు జైలు అధికారులు కల్పించడం లేదు.. రాజకీయాల్లో ఉన్నవారు ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం తప్పదని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.. రాజకీయంగా నైతిక విలువలు పడిపోయాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
