Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సన్నద్ధతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో 2027 గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల వంటి మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ఇప్పటి వరకు సరైన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదన్నారు. “అధికారులు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకి వాస్తవ పరిస్థితులు తెలియజేయాలి. కాగితాలపై ప్రణాళికలు చూపించడం కాదు, నేలమీద పనులు కనిపించాలి” అని స్పష్టం చేశారు.
పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. రూ.8,600 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన పనులకు ఇప్పటికీ డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. “ఒకే ఏడాదిలో 7 వేల పనులు ఎలా పూర్తి చేస్తారు? సరైన ప్రణాళిక లేకుండా పనులు ప్రారంభిస్తే నాణ్యత దెబ్బతింటుంది” అని వ్యాఖ్యానించారు. పర్యాటక శాఖ నుంచి ఆశించిన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదని పేర్కొన్న పవన్.. కేంద్ర నిధులు పొందాలంటే పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. “ప్రణాళిక లేకుండా అడిగితే ప్రధాని నరేంద్ర మోడీ నిధులు ఇవ్వరు. ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన డేటా, డీపీఆర్, ఖర్చుల అంచనాలు సిద్ధంగా ఉండాలి” అని అన్నారు. అలాగే, హడావుడిగా నాసిరకం పనులు చేస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “పాచిపోయిన సిమెంట్‌తో పనులు చేసి తర్వాత ప్రమాదాలు జరిగితే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది” అని స్పష్టం చేశారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఇక, గత పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. పుష్కరాల ఏర్పాట్లు కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా ఆరు జిల్లాల్లోని 274 పంచాయతీల వరకు విస్తరించాలని సూచించారు. భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో స్నానం చేసేలా చర్యలు తీసుకోవాలని, గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల సన్నద్ధత అంశాన్ని త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు 2027 గోదావరి పుష్కరాలకు అవసరమైన నిధుల సమీకరణలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాకిరణంలా నిలుస్తారని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!