Gudivada Amarnath: కక్ష పూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్, విజయనగరం జడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. ఆ తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నా్థ్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇదే విధంగా ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి కక్ష పూరితంగా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కక్ష పూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు. నేరస్తులను బయట విడిచిపెట్టి వారి చెప్పిన పేర్లతో సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు.
Read Also: Rajastan: అసలు మీరు మనుషులేనా.. అపుడే పుట్టిన శిశువు నోట్లో ఫెవికిక్..
అక్కడ అడ్డూ అన్నారు.. ఇక్కడ లిక్కర్ అన్నారు.. ఎందులోనూ అభియోగాలు నిరూపించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు అమర్నాథ్.. మరోవైపు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాలకృష్ణ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారాన్ని డైవర్ట్ చేయడానికి మరొక వైసీపీ నాయకుడు ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయని దుయ్యబట్టారు.. ఎంపీ మిథున్ రెడ్డికి.. ఉత్తరాంధ్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని అన్నారు. మిథున్ రెడ్డి జైల్లో ధైర్యంగా ఉన్నారని, ఇటువంటి కుట్రలు, అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని చెప్తున్నారని అమర్నాథ్ అన్నారు. మిథున్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్..