Fire Accident At Forest: రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఇక, చక్రద్వారా బంధం గ్రామ సమీపంలో మంటలు వ్యా్ప్తి చెందడంతో.. గ్రామస్తులతో పాటు రైతులు తీవ్ర భయాందోళ వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించగా.. రంగంలోకి దిగిన ఫైర్ డిపార్ట్మెంట్ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
Read Also: Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో చిట్ఫండ్ కంపెనీ పేరుతో మోసాలు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..!
అయితే, రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదం జరగినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి తెలియడంతో.. హూటాహూటీన ఆ ప్రాంతానికి వెళ్లి చెట్లు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక, అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇది మానవ తప్పిదంగా జరిగిన ప్రమాదంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ శాఖలో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తేల్చి చెప్పారు. రాజమండ్రి నగరానికి ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో అగ్ని ప్రమాదం జరగడంపై అధికారులు వెంటనే స్పందించారు.. లేకపోతే పెను ప్రమాదం జరిగేదాని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.