Ambati Rambabu: జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు అంబటి. గత 19 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయన విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ నిర్వహించి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో అంబటి రాంబాబు అరెస్టయ్యారు. ఈ కేసుతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు నమోదైన మరో కేసు, అలాగే రెండు పీటీ వారెంట్ కేసుల్లో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుల నేపథ్యంలో అంబటి రాంబాబు 19 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అంబటి విడుదల సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు. నాయకుడికి స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు.

Read Also: US-Iran Tension: ఇరాన్ సమీపంలో F-35, F-16 జెట్‌లు.. అమెరికా ఏం ప్లాన్ చేస్తోంది.?