Site icon NTV Telugu

AP Crime: స్నేహితుడి భార్యతో రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు..! హత్యకు గురయ్యాడు..

Rakhi

Rakhi

AP Crime: స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్ కు చెందిన భాగ్ రాధాకాంత్. రాఖీ పండుగ రోజున తన భార్యతో రాఖీలు కట్టించడానికి స్నేహితులను ఇంటికి పిలిచాడు. అందరూ రాఖీలు కట్టించుకున్నారు. కానీ, ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు. పైగా రాధాకాంత్ భార్యా శీలాన్ని దూషించాడు. దీనితో సతీష్ కుమార్ పై కక్ష పెంచుకున్నాడు రాధాకాంత్ . పథకం ప్రకారం మద్యం మత్తులో ఉండగా తన తోటి స్నేహితులతో కలిసి సతీష్ కుమార్ ను హత్య చేశాడు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను టూ టౌన్ సీఐ పి. శివగణేష్ అరెస్టు చేశారు.

Read Also: Kukatpally Sahasra Case: మా బాబుతో క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదు..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులైన ఆల్కట్ గార్డెన్స్ చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజ అతనిని హత్య చేసినట్లు తేల్చారు. రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. ధవళేశ్వరం ఐవోసీఎల్ ప్రాంతానికి చెందిన వేపాడి సతీష్ కుమార్(22) రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ధవళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడప్పుడూ కైలాసభూమి వెనుక ప్రాంతంలో మద్యం తాగుతుండేవాడని సతీష్ కుమార్ తో పనిచేసేవారు చెప్పడంతో ఈ నెల 15న ఆయన సోదరుడు అక్కడికి వెళ్లి చూడగా.. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.

Read Also: Kukatpally Sahasra Case: మా బాబుతో క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదు..

ఇక, రెండో పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ పి. శివ గణేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 9న తెల్లవారుజామున సతీష్ కుమార్ స్నేహితులైన భాగ్ రాధాకాంత్, బాగ్ గౌతం, దొంగ సౌదిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజతో కలిసి గోదావరి గట్టు దిగువన కైలాసభూమి శ్మశానంలోకి వెళ్లినట్లు గుర్తించారు. లోతుగా విచారించగా ఘటనకు ముందురోజు రాత్రి భాగ్ రాధాకాంత్ భార్య గురించి చెప్పమంటే నిరాకరించడంతోపాటు మళ్లీ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడట.. దీంతో, వాగ్వాదం జరిగి అతన్ని కాళ్లు, చేతులతో తన్ని కర్రతో కొట్టి, అపస్మారక స్థితిలో ఉన్న సతీష్ కుమార్ పీకపై భాగ్ రాధాకాంత్ కాలువేసి ప్రాణం పోయేవరకు తొక్కేసి, మృతదేహాన్ని కైలాసభూమి వెనక గోడ అవతల విసిరి ఇళ్లకు వెళ్లిపోయినట్లు తేలింది. తమ గురించి పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం ఆల్కట్ గార్డెన్స్ వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోవడంతో రిమాండ్ కు తరలించారు.

Exit mobile version