Adipurush: వివాదాల నేపధ్యంలో ‘ఆదిపురుష్’లో మార్పులు.. టీం సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manoj Muntashir Shukla Says Adipurush Team Decided to revise some Dialouges: ‘ఆదిపురుష్ ‘లో వివాదాస్పద డైలాగ్స్ తొలగించడానికి ‘ఆదిపురుష్ ‘ సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శల నేపథ్యంలో మేకర్స్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ప్రతి భావోద్వేగాన్ని గౌరవించడం రామ కథ నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం అని అయన పేర్కొన్నారు. తప్పు లేదా కరెక్ట్ అనేది సమయంతో పాటు మారుతూ ఉంటుంది కానీ ఆ అనుభూతి మిగిలి ఉంటుంది. ఆదిపురుష్ లో 4000 లైన్లకు పైగా డైలాగ్స్ రాశాను, కానీ 5 లైన్లలో కొన్ని సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి కానీ ఆ వందలాది పంక్తులలో, శ్రీరాముని కీర్తింపబడిన, మా సీత యొక్క పవిత్రతను వర్ణించిన క్రమంలో ప్రశంసలు కూడా అందవలసి ఉంది, అవి నాకు ఎందుకు అందలేదో నాకు తెలియదని అన్నారు.
Adipurush : మాట మార్చిన ఆదిపురుష్ రైటర్.. అప్పుడలా, ఇప్పుడిలా!
నా సొంత సోదరులే సోషల్ మీడియాలో నాపై అసభ్యకరమైన మాటలు రాశారని, అదే నా స్వంత, గౌరవనీయులైన తల్లుల కోసం నేను టీవీలో చాలాసార్లు కవితలు చదివానని అన్నారు. కానీ ఇప్పుడు అలంటి వారే నా స్వంత తల్లిని అసభ్యకరమైన పదాలతో సంబోధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆలోచిస్తూనే ఉన్నాను, విభేదాలు ఉండవచ్చు, కానీ ప్రతి తల్లిని తన తల్లిగా భావించే శ్రీరాముడిని చూడటం మరిచిపోయేంత నా సోదరులకు కోపం వచ్చిందని కౌసల్య పాదాల దగ్గర కూర్చున్నట్లుగా రాముడు శబరి పాదాల దగ్గర కూర్చున్నాడని ఆయన అన్నారు.. 3 గంటల సినిమాలో మీ ఊహకు భిన్నంగా 3 నిమిషాల పాటు రాసి ఉండొచ్చు కానీ నా నుదుటిపై సనాతన్-ద్రోహి అని రాసేందుకు మీరు ఎందుకు తొందరపడ్డారో నాకు తెలియలేదని ఆయన అన్నారు.. ‘జై శ్రీ రామ్’, ‘శివోహం’, ‘రామ్ సియారామ్’ పాటలు వినలేదా? ఆదిపురుష్ సినిమాలోని ఈ సనాతన స్తుతులు కూడా నా కలం నుండి పుట్టినవే, ‘తేరి మిట్టి’, ‘దేశ్ మేరే’ కూడా నేనే రాశాను అని ఆయన వెల్లడించారు.
Thalapathy Vijay: అదే చివరి సినిమా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం?
మీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఉన్నారు, ఉంటారు, మనం ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడితే సనాతన ధర్మమే నష్టపోతుంది. మేము సనాతన్ సేవ కోసం ఆదిపురుష్‌ని సృష్టించాము, దీనిని మీరు పెద్ద సంఖ్యలో చూస్తున్నారు, భవిష్యత్తులో కూడా మీరు చూస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు. ఈ పోస్ట్ ఎందుకు? ఎందుకంటే నాకు మీ భావన కంటే గొప్పది ఏమీ లేదు. నా డైలాగ్‌లకు అనుకూలంగా నేను లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలను, కానీ ఇది మీ బాధను తగ్గించదు. అందుకే మిమ్మల్ని బాధించే కొన్ని డైలాగులని రివైజ్ చేస్తాం, ఈ వారం వాటిని సినిమాలో చేర్చుతాం, ఈ మేరకు నేనూ, సినిమా నిర్మాత-దర్శకుడూ నిర్ణయించాం, మీ అందరినీ శ్రీరాముడు అనుగ్రహించుగాక అంటూ ఆయన ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు.
रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…Also Read
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
— Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!