ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఇవాళ నెరవేరనుంది. పశ్చిమగోదావరి జిల్లా యనరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం స్ధాపనకు అడుగులు పడనున్నాయి. తమిళనాడు మరియు కేరళ తర్వాత ఇది దేశంలో మూడవ ఆక్వా విశ్వవిద్యాలయం కాబోతుంది. ఇందుకోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సరిపల్లి మరియు లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించడం జరిగింది. భవన నిర్మాణ పనులకై మొత్తం రూ. 332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ఆమోదం. యూనివర్శిటీ రెండవ దశ పనులలో భాగంగా నరసాపురం మండలంలోని బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ. 222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం మరియు పరిశోధనా కేంద్ర నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది.
Read Also: Bihar accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి
మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు మరియు ఆక్వాకల్చర్ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందబోతున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వాకల్చర్ రంగంలో పంట నష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. తద్వారా దాదాపు సంవత్సరానికి రూ. 4,000 నుంచి 5,000 కోట్ల ఆర్ధిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్ డిప్లొమా, బీఎఫ్‌ఎస్‌సీ, ఎంఎఫ్‌ఎస్‌సీ, మరియు పీహెచ్‌డీ అర్హత గల అభ్యర్ధులను తయారుచేయడానికి ఆక్వా యూనివర్శిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు మరియు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ యూనివర్శిటీ స్ధాపనతో ప్రొఫెషనల్ మ్యాన్ పవర్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదంటున్నారు. సీఎం జగన్ పర్యటన పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bihar accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి