CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 33 వేల కోట్ల రూపాయల పెన్షన్.. నెలలో మొదటి రోజున ఇస్తున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం.. దీని వల్ల అటెండెన్స్ పెరిగింది.. ఇవాళ ఆటోమేటిక్ గా పిల్లలు స్కూళ్లకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇక, స్త్రీ శక్తి సాధ్యం కాదు అన్నారు, కానీ చేసి చూపించాం.. కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన పూర్తి చేసుకుంది.. భారత్ నెంబర్ వన్ కావాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోడీ పని చేస్తున్నారు.. భారత ఆర్ధిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4 స్థానానికి చేరుకుంది.. గతంలో అమెరికాను అగ్రస్థానంలో చూసేవాళ్లం.. ఇప్పుడు భారత్ ఆ దేశానికి సమాన స్థాయికి వెళ్తుందన్నారు. మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి అవుతుంది.. ఆ సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధరలు!
అయితే, సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వానిది ఓ నిర్దుష్టమైన విధానం.. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారు చేస్తే ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించింది.. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని సూచించారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానానికి ఎదగాలని తెలిపారు. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకూ సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియమాకాలు చేశామన్నారు. ఇక, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ మంత్రులను నియమించి కేబినెట్ కూర్పు చేశాం.. డబుల్ ఇంజన్ సర్కార్- డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Ileana : రెండో బిడ్డ తర్వాత మానసికంగా గందరగోళం అనిపించింది..
ఇక, 2047 వరకూ 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కలెక్టర్ల సదస్సు ద్వారా జరిగే చర్చలో ప్రతీ నిముషం సద్వినియోగం కావాలి.. ప్రస్తుతం వృద్ధిరేటు 10.5 శాతం ఉంది.. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని రూ.3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాం.. 2029 నాటికి రూ.29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.. అప్పటికి రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పని చేయాలన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.. అందరినీ సాధికారిత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని విశ్వసించే ఎన్డీఏ కూటమికి ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు.. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజల తరపున, మా తరపుపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం.. కొనసాగుతున్న కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: IND vs PAK: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో బిగ్ మిస్టేక్ .. వీడియో వైరల్!
కాగా, ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జిల్లాల రూపు రేఖల్ని మార్చటంలో వారిదే ప్రధాన బాధ్యత.. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లే.. ప్రపంచంలోనే అతి ఎక్కవ జనాభా ఉన్న దేశం భారత్.. సమాజంలో ఉన్న అందరికి అవకాశం ఇవ్వలనేది మా ఉద్దేశం.. ఒకప్పుడు అతి తక్కువ ఆదాయం ఉన్న జిల్లా అనంతపురం ఇప్పడు కోనసీమకంటే ముందు ఉంది.. దీనికి కారణం అక్కడ నీరు లభిస్తోంది.. ప్రపంచంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం తెలుగువారికి ఉంటే దక్షణాదిలో ఏపీ చివరిలో ఉందన్నారు. దేశంలోనే అతి ఎక్కువ పర్ క్యాపిటా ఇన్ కాం ఉన్నది తెలంగాణకు.. పట్టిసీమ పూర్తిచేసి కృష్ణా వాటర్ ను రాయలసీమకు ఇచ్చాం.. దీని ఇంప్యాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నామన్నారు. 100 రోజుల్లో హంద్రీనీవా పూర్తిచేసి 770 కిలో మీటర్లు తీసుకువెళ్లి కుప్పానికి నీరు ఇచ్చాం.. గోదావరి, కృష్ణాతో పాటు ఎప్పుడు నీరు ఉండని పెన్నాకు కూడా ఇప్పడు వరదలు వచ్చాయని చంద్రబాబు తెలియజేశారు.