బాలీవుడ్, టాలీవుడ్ లో తన ప్రత్యేక గుర్తింపుతో గుర్తింపు పొందిన ఇలియానా డి క్రజ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఓ అవగాహన షేర్ చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఇలియానా, భర్త మైఖేల్ డోలన్తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చారు. రెండో కొడుకు కీను రాఫే డోలన్గా పేరు పెట్టారు. ఇప్పటికే మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ను చూసి మమ్మీగా అనుభవం పొందిన ఇలియానా, రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్పటి అనుభవం మానసికంగా గందరగోళంగా ఉందని తెలిపారు.
Also Read : Dhanush: ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్‌లో..చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ధనుష్
ఇలియానా మాట్లాడుతూ.. “రెండో బిడ్డకు జన్మనిచ్చిన అప్పుడు మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను. స్నేహితులు దగ్గరగా లేకపోవడం వల్ల మద్దతు అందలేదు. మొదటి బిడ్డ సమయంలో ప్రతిదీ అంగీకరించడానికి ప్రయత్నించాను. ఒంటరి మహిళగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఈ పరిస్థితి ఎదురవ్వడం కష్టంగా అనిపించింది. ఆ తర్వాత బిడ్డ ఆరోగ్యం, పోషణ పై ఎక్కువ దృష్టి పెట్టాను. కానీ రెండోసారి మానసిక స్థితి పూర్తిగా గందరగోళంలో పడింది” అని వివరించారు. అంతేకాక, ఇలియానా భారతదేశం నుంచి బయటకు వెళ్లినప్పుడు ముంబైను మిస్ అయ్యారట. ముంబైలో తన స్నేహితురాలు మద్దతు ఉంటుందని తెలిపారు, కానీ అందరిని మిస్ అవుతున్నాను ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలియానా, మైఖేల్ 2023లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు, విదేశాల్లో నివసిస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే, 2024లో ‘Do Aur Do Pyaar’ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తి తదితరులతో నటించారు. ఆ తర్వాత సినిమాల్లో కనిపించడం లేదు. ఇలియానా కెరీర్ పునరారంభం చేయాలంటే, పిల్లలు పెద్దవాళ్లవ్వాలని ఆమె పేర్కొన్నారు.