NTV Telugu Site icon

Nandamuri Taraka Ratna: ఆస్పత్రికి వచ్చినప్పుడు తారకరత్నకు పల్స్‌ లేదు-వైద్యులు

Doctors

Doctors

Nandamuri Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తలపెట్టిన పాదయాత్ర ఇవాళ కుప్పం నుంచి ప్రారంభం అయ్యింది.. అయితే, ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోయారు.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కుప్పంలోని కేసీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఆస్పత్రికి వెళ్లిన హీరో బాలకృష్ణ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.. మరోవైపు కేసీ మెడికల్‌ ఆస్పత్రి నుంచి కుప్పం పీఎస్‌ మెడికల్‌ కాలేజీకి రిపర్‌ చేశారు వైద్యులు.. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.. మెరుగైన వైద్య కోసం బెంగళూరు తరలించే అవకాశం ఉందంటున్నారు.. అయితే, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్యులు.. ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అసలు పల్స్‌ లేదని చెబుతున్నారు.

Read Also: Nandamuri Taraka Ratna: లోకేష్‌ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఓ వైద్యుడు.. తారకరత్నను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు ఆయన పల్స్‌ పడిపోయింది.. అసలు పల్స్‌ లేదు అన్నారు.. ఆ సమయంలో ఆయన శరీరం మొత్తం బ్లూగా మారింది.. వెంటనే ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టాం.. అయితే, 45 నిమిషాల తర్వాత పల్స్‌ మళ్లీ మొదలైందన్నారు.. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నాం అని తెలిపారు వైద్యులు.. అయితే, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయన్ను మెరుగైన ఆరోగ్యం కోసం బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.. ఆస్పత్రికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.

Show comments