NTV Telugu Site icon

Dharmana Prasada Rao: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోకి కట్టుబడి పని చేస్తుంది

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao Says YCP Govt Working By Adhering To Manifesto: తమ వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల నుంచి మేనిఫెస్టోకి కట్టుబడి పని చేస్తోందని, కరప్షన్ లేకుండా పథకాలను అందిస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పేదలకు ఆర్థికంగా ఉపశమనం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని, ఆ దిశగానే పని చేస్తుందని తెలిపారు. నాడు పాదయాత్రలో జగన్ చెప్పింది చెప్పినట్టే చేస్తున్నారని చెప్పారు. మహిళలు నేడు బలమైనశక్తిగా, కుటుంబానికి లీడర్‌గా ఎదిగారని తెలిపారు. సమాజానికి చంద్రబాబు నేర్పింది.. ఏ పనికి వెళ్లినా డబ్బులు ఇవ్వడమని చెప్పారు. ఆయన బ్రోకర్ వ్యవస్థని సృష్టించారని ఆరోపించారు.

Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పేరు తెలిసిపోయిందిరోయ్.. ఇక రచ్చ షురూ చేయండి

పారదర్శకమైన పాలన తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టాలని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న జగన్ ప్రభుత్వానికి మహిళలు అండగా నిలబడాలని కోరారు. ఒకవేళ ఆడవాళ్లు జగన్ ప్రభుత్వాన్ని పడగొడితే.. రేపు ఆడవాళ్లను నమ్మకూడదని అనుకుంటారని పేర్కొన్నారు. మహిళలను అందలం ఎక్కించిన నేతను అక్కున చేర్చుకోవాలని సూచించారు. జగన్‌ని కాదని మరొకరిని అధికారంలోకి తీసుకొస్తే.. వాళ్లు మహిళల ఎకౌంట్‌లో పైసా కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తారా? తిరష్కరిస్తారా? మీరే నిర్ణయం తీసుకోండని పిలుపునిచ్చారు. చంద్రబాబు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకొస్తారని.. బొట్టు, గాజులు కొనుక్కోవాలని నాలుగు వేలు ఇస్తాడని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే సంక్షేమం అందించామన్నారు.

Student Suside: ఇంట్లో గొడవ పడి విద్యార్థి ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

అంతకుముందు కూడా.. ప్రజలకు మంచి చేయాలనే ఏకైక లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోందని ధర్మాన చెప్పారు. అవినీతికి తావు లేకుండా అన్ని పథకాలు లబ్ధిదారుల ఇంటికే నేరుగా చేరుతున్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను బెదిరించేవని విమర్శించారు. తమను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి లేని పరిపాలన ఈ ప్రభుత్వంలోనే ఉందన్నారు.