Dharmana Krishna Das: వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాకపోతే.. గెలిచినా రాజీనామా చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Krishna Das: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైసీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జగన్ మరోసారి సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు.
Read Also: Andhra Pradesh: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండానే అన్ని స్థానాలకు పోటీ చేస్తారని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. పొత్తులు లేకుండా టీడీపీ, జనసేన 175 స్థానాల్లో పోటీ చేయగలవా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయాలని జగన్ ఆకాంక్షిస్తున్నారని.. అందుకే వికేంద్రీకరణ లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. టీడీపీ, జనసేన కేవలం 25 గ్రామాల ప్రజల కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు రాజధానులు పెట్టాలని జగన్ ఆలోచిస్తుంటే పవన్ మాత్రం టీడీపీకి వంతపాడుతున్నారని .. రాజకీయం అంటే సినిమా కాదని పరిణితి కావాలని పవన్‌ను ఉద్దేశించి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!