Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. డిసెంబర్ లో సెలవులు రావడంతో చివరి రెండు వారాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక, ఈ ఏడాది చివరి నెల చివరి రెండు వారాలు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తుండంతో కొద్దిగా రద్దీగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీనివాసుడి దర్శనం కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
Read Also: Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు హైకోర్టులో విచారణ
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 74 వేల 845 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వీరిలో 26 వేల 122 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!