Medaram Jatara: మేడారం మహాజాతరకు అంకురార్పణ సమర్పించిన తర్వాత మండమెలిగే ఉత్సవాలను నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నుంచి ఫిబ్రవరి 24వ తేదీ శనివారం వరకు మేడారం మహాజాతర జరిగింది.
అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరీశించారు. అనంతరం ఉజ్జయిని ఆలయ అధికారులతో…
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతర…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి…