Dharmana Krishna Das: జగన్ మళ్లీ సీఎం కాకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని టీడీపీ అంటోందని.. అంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కామెంట్లకు వైసీపీ నేతలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీలో ప్రజాకర్షణ ఉన్న ఏకైక నేత జగన్ అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్న నాయకుడు జగన్ అని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు ఆయన వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాగా గతంలో కూడా ధర్మాన కృష్ణదాస్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తన ఆస్తులు మొత్తం రాసిస్తానని.. టీడీపీ వాళ్లు ఈ సవాల్‌కు సిద్ధమా అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లకు గెలుస్తామని నమ్మకం ఉంటే.. బెట్ కట్టాలని ఛాలెంజ్ చేశారు. అయితే ఆస్తి మొత్తం రాసిస్తామన్న ధర్మాన సవాల్‌పై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు.
Also Read
తాజావార్తలు
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..