Purandeswari: అభివృద్ధిలో కాదు.. అప్పుల్లో ఏపీ నంబర్ వన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ వన్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోందన్నారు.. భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు కింద పెట్టి రుణాలు తీసుకుని రావాలని చూడ్డం శోచనీయమన్న ఆమె.. వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను ఆధారంగా చేసుకుని అప్పులకు వెళ్తున్నారని విమర్శించారు.. ఉన్న ఆస్తులను అమ్ముకోవడం చూస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతోందని అర్ధం అవుతోందన్న ఆమె.. ఇప్పటికే ఆరు లక్షల పై చీలుక అప్పు భారం ప్రజలపై పడిందన్నారు.
Read Also: Harish Rao: 3 రోజుల పాటు పోలియో చుక్కలు..
Also Read
- Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
- Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
- Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
- AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా ఎక్కువ అప్పులు-తక్కువ అభివృద్ధిగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధిలోనూ కేంద్ర భాగస్వామ్యం ఖచ్చితంగా ఉందన్న ఆమె.. కేంద్రం వనరులు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎంపీకే రక్షణ లేకుండాపోయిందన్న ఆమె.. రాష్ట్ర రహదారులపై గుప్పెడు మట్టి కూడా ఈ ప్రభుత్వం వేయలేకపోతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదనేది నిజం కాదని స్పష్టం చేశారు. కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అభివృద్ధి కంటే అప్పులు తీసుకుని రావడానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
-
Dharani I Love You: సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!
-
Khalifa Trailer: ‘ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
-
LPG e-KYC: ఎల్పీజీ e-KYC గడువు ముగిసింది.. ఇప్పుడు ఏం చేయాలి? కనెక్షన్ రద్దవుతుందా? పూర్తి వివరాలు
-
Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!