ఒకవైపు దీపావళి.. మరోవైపు సముద్రంలో అలజడి.. కోస్తా ప్రాంతంలో తుఫాన్ టెన్షన్ పెడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సిత్రాంగ్ తుఫాన్ స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలోని తీరప్రాంతాల్లోని 105 మండలాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also:Governor Tamilisai Soundararajan: పెండింగ్ బిల్లులపై త్వరలో నిర్ణయం
తుఫాన్ ను ఎదుర్కోనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ గురించి ఆందోళన చెందవద్దని వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 1070, 1800 4250101, 0863 2377118 నెంబర్లకు ఫోన్ చేస్తే తుఫాన్ గురించిన సమాచారం అందుబాటులో ఉంచారు. ఇదిలా వుంటే.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తుఫాన్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. బక్కాలి బీచ్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా వున్నారు. ఎన్డీఆర్ ఎఫ్ టీంలు ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఈ ప్రాంతంలో టూరిస్టులు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో షాపులు మూసివేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా వున్నామని.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీం అధికారి అన్మోల్ సస్మోర్ తెలిపారు.
రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ బంగాల్ తీరప్రాంతాల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం సాగర్ దీవికి 380 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం వల్ల చలి తీవ్రత పెరుగుతోంది.
Read Also: Ebola Outbreak: ఉగాండాలో ఎబోలా కల్లోలం.. ఇప్పటి వరకు 40 మరణాలు.