బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీరాన్ని దాటింది.. ‘అసని తుపాను’ తీవ్రవాయుగుండంగా బలహీనపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరం వైపుగా కదిలి మచిలీపట్నం – నరసాపురం మధ్య ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని దాటిందని ప్రకటించింది రాష్ట్ర విపత్తుల సంస్థ.. ఇక, రేపు ఉదయానికి అసని తుఫాన్ మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ విపత్తలు సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అసని తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మచిలీపట్నం మరియు నరసాపురం మధ్య తీరం దాటింది.. గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.. ఇక, అసని ప్రభావంతో.. తూర్పు తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. మరోవైపు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలు భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి..
Read Also: UP: డీజీపీపై వేటు వేసిన సీఎం యోగి