Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
- అనకాపల్లి తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం
- బలమైన గాలులకు నేలకూలుతున్న చెట్లు
- పూడిమడక, సీతపాలెంలో ప్రజల్లో ఆందోళన
- లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నబ్’ తీవ్ర తుఫాన్ అనకాపల్లి జిల్లాలో తన ప్రతాపాన్ని చూపుతోంది. ఉగ్రరూపం దాల్చిన ఈ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల భారీ వేగంతో విరుచుకుపడ్డ భీకర గాలులకు జిల్లాలోని తీర ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా పూడిమడక, సీతపాలెం ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న భారీ వర్షానికి తోడు వీస్తున్న ఈదురు గాలుల తాకిడికి గంగపుత్రులు గజగజా వణుకుతున్నారు.
నేలకూలుతున్న చెట్లు.. ఎగిరిపోతున్న పైకప్పులు
తుఫాన్ ఉధృతికి బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో తీర ప్రాంతాల్లో భారీ వృక్షాలు, చెట్లు వేళ్లతో సహా నేలకొరుగుతున్నాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాలు, భయానక శబ్దాలతో కూడిన గాలుల కారణంగా మత్స్యకారుల కుటుంబాలు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
- Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
- TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
- AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
అప్రమత్తమైన యంత్రాంగం.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు అధికార బృందాలు రంగంలోకి దిగాయి.
తాజావార్తలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్పై ప్రత్యేక చర్చ
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!