Cyber Fraud: AI టెక్నాలజీతో సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లు చెప్పి డబ్బులు వసూల్ చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత నుంచి 50 వేల రూపాయలను భార్గవ్ వసూలు చేశాడు. సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు AI వీడియోతో బురిడీ కొట్టించాడు. భార్గవ్ తూర్పు గోదావరి జిల్లా వెంకన్న గూడెంకి చెందినట్టు గుర్తించారు.
Read Also: Israel: రెండేళ్ల తర్వాత విషాదకర నిర్ణయం.. హమాస్ చేతిలో ప్రియురాలి చనిపోయిందని ప్రియుడు ఆత్మహత్య
అయితే, భార్గవ్ ఇంటికి నల్లజర్ల పోలీసులు వెళ్లాగా అతడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోసాలకు పాల్పడుతున్న భార్గవ్ తమ దగ్గరకు ఏడాది నుంచి రావటం లేదని తెలిపారు. బీటెక్ పూర్తి చేసి మోసాలకు పాల్పడుతున్న భార్గవ్ పై గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయింది.