NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..

Tirumala

Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఈరోజు ఆదివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో స్వామి వారిని ఈజీగా దర్శించుకుంటున్నారు. అతి తక్కువ టైంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఏడు కొండల మీద భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం కూడా భక్తుల సంఖ్య స్వల్పంగా ఉండటం ఇదే తొలిసారి అని వెల్లడించారు.

Read Also: Hydra: అమీన్ పూర్, కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు..

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్నటి(శనివారం) వరకూ శ్రీనివాసుడి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టేది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తైతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 82 వేల 406 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31 వేల 151 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.