Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
  • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..
  • పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్..
Tirumala

Tirumala

Tirumala Rush: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుండటంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనానికి కూడా 18 గంటల సమయం పడుతుంది. అలాగే, వసతి గృహాలు కూడా దొరకడం తీవ్ర ఇబ్బందిగా మారింది. రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read Also: Suryakumar Yadav Catch: ‘సూర్యా’ భాయ్.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌ (వీడియో)!

తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది అని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. ఇక, స్వామివారిని నిన్న 80, 404 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 35, 825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే, తిరుమల హుండీ ఆదాయం 3. 83 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు కనీస సదుపాయాలను అందిస్తున్నారు.