NTV Telugu Site icon

CPI Ramakrishna: ఏపీ జలవనరుల శాఖ మంత్రికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వినతి..

Cpi

Cpi

CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినతి చేశారు. ఇక, తుంగభద్ర హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. హంద్రీ-నీవా కెనాల్ రెండింతలు చేసి పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు తాగిన చర్యలు చేపట్టాలన్నారు. తుంగభద్ర డ్యాం ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 32 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా.. కేవలం 13 టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయి.. అనంతపురం జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు ఖాళీగా ఉన్నాయని రామకృష్ణ చెప్పారు.

Read Also: Devi Sri Prasad: సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన దేవి శ్రీ ప్రసాద్.. ఎందుకంటే?

ఇక, నాలుగు వేల క్యూసెక్కుల నీటిని హెచ్ఎల్సీ ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు అని సీపీఐ రామకృష్ణ తెలిపారు. కాలువ లైనింగ్ పూర్తి కాకపోవడం వల్ల 1800 క్యూసెక్కుల మాత్రమే సరఫరా కొనసాగుతుందన్నారు. ఈ బడ్జెట్లో పూర్తిస్థాయి నిధులు కేటాయించి కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలి అని ఆయన కోరారు. శ్రీశైలం డ్యాం నిండుకుండలా ఉన్నా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు హంద్రీ-నీవా కెనాల్ ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు అందడం లేదు.. గతంలో వైసీపీ, టీడీపీలు రెండూ హంద్రీ-నీవా కెనాల్ సామర్ధ్యాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి.. నెరవేర్చలేదన్నారు. ఈ బడ్జెట్లో ఈ కెనాల్ ను రెండింతలు చేసి.. పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలని సీపీఐ రామకృష్ణ వెల్లడించారు.