CPI Narayana: సీఎం అయ్యాక జగన్ గుణం మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Reaction On Amaravati Farmers Padayatra: నేటి నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర -2 మీద సీపీఐ నారాయణ స్పందించారు. ఇది అమరావతి రైతుల రెండో పోరాటమని పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని వైస్ జగన్ హామీ ఇచ్చారని, కానీ సీఎం అయ్యాక ఆయన గుణం మారిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలు, ర్యాలీలంటే.. ఎందుకు సీఎంకి కోపమని ప్రశ్నించారు. మీరు, మా నాన్న కూడా పాదయాత్రలు చేసే ముఖ్యమంత్రులు అయ్యారని సీఎం జగన్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం పదవి నుంచి జగన్ దిగిపోవాలన్న ఉద్దేశంతో రైతులు పాదయాత్ర చేయడం లేదని, కేవలం అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారని వెల్లడించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. రైతులు చేపట్టిన ఈ మహా పాదయాత్ర ‘ధర్మయాత్ర’ అని పేర్కొన్నారు. రాజధాని పేరు చెప్పి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారని.. రాజధాని వికేంద్రీకరణ ప్రపంచంలోనే ఎక్కడ లేదని అన్నారు. ‘మొదట కులాల మధ్య విద్వేషాలు సృష్టించారు.. ఇపుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. విశాఖను రాజధానిగా నియమిస్తే.. రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కావాలని కోరలేదని.. అభివృద్ధి కావాలన్నారని చెప్పారు. అమరావతి రాజధానికి బిజేపి కట్టుబడి ఉందని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!