సింహాద్రి అప్పన్న కోడెదూడల మృత్యువాతపై దేవస్థానం చేతులు ఏతేసింది. ఈ దేవస్థానంలో రెండు రోజుల వ్యవధిలో 23కి పైగా కోడెలు మృతి చెందాయి. దేవస్థానం వైఫల్యంపై ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈవోతో బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దేవస్థానం నిర్వహణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కోడెల మరణంపై స్పందించిన ఈవో సూర్యకళ,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు.. పర్యవేక్షణ బాధ్యతలు చూసే శక్తి మాకు లేదు… జెర్సీ దూడలను స్వామి వారికి సమర్పించవద్దని కోరిన భక్తులు వినడం లేదు. కోడె దూడల సంరక్షణ బాధ్యతల నుంచి దేవస్థానంను మినహాయించాలని కలెక్టర్ కు నివేదిస్తాం అని తెలిపారు.