కేసీఆర్ చేస్తున్న ధర్నాపై కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ .. కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను రాష్ర్ట, కేంద్రప్రభుత్వాలు కొనకుంటే ఎవ్వరూ కొంటారని ఆయన ప్రశ్నించారు. చైనా, శ్రీలంక, బర్మా, పాకిస్తాన్ దేశాలు కొంటాయ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీకు పాలన చేతకాకుంటే వదిలేయ్ అని భట్టీ అన్నారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామంటే మందుకు రాలేదు. ఇప్పుడు సిగ్గులేకుండా ఇందిరా పార్క్ ధర్నా వద్ద కేసీఆర్ కూర్చున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని, మందు ఒకలాగా వెనకాలో మరోలాగా వ్యవహరిస్తున్నాయన్నారు.
రైతుల భూములను ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర సర్కారు తీరు ఫలితంగా నిత్యా వసర సరుకుల ధరలు మరింతగా పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ హ యాంలో రైతుల పక్షాన పనిచేశాం. రోడ్లపై దీక్షలు, ధర్నాలు చేసిన సర్కార్ను ఇప్పటి వరకు చూడలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాల నలో రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. మేము రైతుల పక్షాన నిల బడతాం.. కల్లాల వరకు వెళ్తాం. ధనిక రాష్ట్రం కేంద్రం కొన్న కొనక పోయిన.. నేను కొంటా అన్నావ్ కేసీఆర్ ఇప్పుడెందు మాటమీద నిలబడటం లేదని భట్టి విక్రమార్క కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.