CM YS Jagan: రేపు బాపట్లలో సీఎం జగన్ పర్యటన.. విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని నాలుగు లక్షల 60వేల మంది విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ జరగనుంది.. అంతేకాదు, హైస్కూళ్లలోని 60 వేల మంది టీచర్లకు కూడా ప్రభుత్వం ట్యాబ్‌లు అందిస్తోంది.
Read Also: Srinivas Goud: పక్క రాష్ట్రమైనా, సొంత రాష్ట్రమైనా.. నకిలీ మద్యం చేస్తే వదిలే ప్రసక్తే లేదు
Also Read
- CM Chandrababu: స్టేజ్‌పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
ఇక, రేపటి నుంచి వారం రోజుల పాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు అధికారులు.. ట్రయల్ మెథడ్‌లో నిడమానూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు పంపిణీ చేశారు.. ఆఫ్ లైన్ ఫార్మెట్లో ట్యాబ్‌లు అందిస్తారు.. బైజూస్ కంటెంట్‌ని అప్లోడ్ చేసిన ఆ ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు.. కోర్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాల వీడియోలు, ఎక్సర్సైజులు ఆ ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు. విద్యార్ధుల లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ట్యాబ్‌లు పెంచుతాయని అంచనా వేస్తున్నారు.. అయితే, రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు సీఎం జగన్.. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
బాపట్ల జిల్లా పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకోనున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు… ఇక, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు బాపట్ల జిల్లా నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!