Srinivas Goud Appriciates Telangana Excise Police For Busting Fake alcohol: ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న నకిలీ మద్యాన్ని పట్టుకున్న అధికారుల్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. పక్క రాష్ట్రమైనా, సొంత రాష్ట్రమైనా.. నకిలీ మద్యాన్ని తయారు చేస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్లే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసే వారిని, తయారు చేసే వారిని వదిలిపెట్టొద్దని తాము ఆదేశించామన్నారు. ఇక్కడి నుండి ఖాళీ బాటిల్స్, లేబుల్స్ తీసుకొని వెళ్ళి.. ఒడిశాలోని కటక్ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్నారు.
Shalini Kidnap Case: శాలిని కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్.. యువతికి ఆల్రెడీ పెళ్లి
ఎక్సైజ్ అధికారులు వద్ద ఆయుధాలు ఉండవని.. తలలు పగిలినా, ప్రాణాలు పోతున్నా గుడుంబాను అరికట్టామని అన్నారు.తీగ లాగితే డొంక కదిలినట్లు.. మొత్తం నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టయ్యిందని చెప్పారు. ఎక్కడా, ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా బార్ కోడ్లను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కంపెనీలు తయారు చేసేంత ఆల్కహాల్ పర్సంటేజీని ఉంచారని, చాలా పకడ్బందీగా ఆ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని చెప్పారు. రెండున్నర కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని పట్టుకున్నామన్నా తెలిపారు. అలాగే.. గంజాయిని సైతం ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామన్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేస్తోన్న నిందితుల్ని.. ఎంతో తెలివిగా పట్టుకున్నామని స్పష్టం చేశారు. మద్యం అమ్మకాలపై ఎవరికైనా ఎలాంటి అనుమానం ఉన్నా.. వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ మద్యాన్ని ఎక్కువగా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అమ్ముతున్నారని వెల్లడించారు.
Kerala Couple With Jersey: ఫిఫా వరల్డ్‌కప్ ఫీవర్.. జెర్సీలతో పెళ్లి పీటలెక్కిన వధూవరులు
మరోవైపు.. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం కేసులో దర్యాప్తుని వేగవంతం చేశారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు ఒడిశాతో పాటు తెలంగాణలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం తయారీదారు సమచారం మేరకు.. మూడు ప్రత్యేక బృందాలు ఒరిస్సాకు వెళ్లాయి. అక్కడ మద్యం కేంద్రాన్ని గుర్తించి, దాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 300 కేసుల నకిలీ మద్యం, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు ఒడిశా వాసులు, ఇద్దరు తెలంగాణ వాసులున్నారు.