భూ హక్కు- భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష.. ఇలా చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని.. డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో కూడా సర్వే పూర్తి కానున్నట్టు సీఎంకు తెలిపారు.. ఇక, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. క్రయ విక్రయాల సమగ్ర డేటా అప్డేట్ కావాలని.. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలని తెలిపారు… న్యాయ, ల్యాండు రికార్డుల్లో నిపుణులు, అనుభవం ఉన్న వారితో ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన.. వీరిచ్చిన సిఫార్పుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలకు సంబంధించి ఎస్‌వోపీలు రూపొందించాలన్నారు.. ఇక, ల్యాండ్ రికార్డుల అప్డేషన్ కోసం ప్రతి ఏటా ఒక వారం డ్రైవ్ చేపట్టాలని.. ల్యాండ్ సర్వేను పూర్తి చేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు.
సంస్కరణలు అవినీతికి చోటులేకుండా, రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలన్నారు సీఎం వైఎస్ జగన్.. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశానికి సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. 22ఏ కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం జగన్.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, పెట్టాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలన్నారు.. దీని కోసం ఆధీకృత వ్యవస్థను బలోపేతంచేయాలని ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!