AP: వైసీఎల్పీ భేటీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. మూడేళ్ల తర్వాత ఈ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగింది.. సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్.. ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణాలు, ఉద్దేశాలు ఉన్నాయన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పాటై 34 నెలలు కావొస్తోంది.. మరో 2 నెలల్లో మూడు సంవత్సరాలు కూడా పూర్తి కావొస్తోంది.. ఇక పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.. నా అనుభవంతో నేను చెప్తున్నాను… ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లడం కన్నా.. మరే ప్రభావవంతమైన కార్యక్రమం లేదన్న ఆయన.. కనీసం మూడు సార్లు డోర్–డోర్‌టు కార్యక్రమం చేయాలి.. కనీసం 2 సార్లు ప్రతి గడపకూ వెళ్లాల్సిన అవసరం ఉందని.. లేకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు.
Read Also: High Court: ప్రభుత్వ ఉద్యోగులు సెల్‌ఫోన్లు వాడొద్దు.. హైకోర్టు ఆదేశాలు
Also Read
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు సీఎం వైఎస్ జగన్.. అందుకే ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామన్న ఆయన.. మన ఇళ్ల దగ్గర మనం కూర్చోవడం, ప్రజలు మనల్ని కలవడం అన్నదానికి ఇకపై పుల్‌స్టాప్ పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.. ఉగాది నుంచి వాలంటీర్లకు సన్మానం చేస్తున్నాం.. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని.. వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వాలంటీర్లకు మనం పారితోషికం, మెడల్ ఇవ్వడం చేస్తున్నట్టు వెల్లడించారు.. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నామని.. ఏప్రిల్ 2 నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజులు కొనసాగుతుందన్న ఆయన.. ప్రతి ఊరికీ వెళ్లి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని.. గత ఏడాది కూడా వాలంటీర్లను సన్మానించాం.. ఈసారి ప్రతి రోజూ 3–4 గ్రామాలు వెళ్లి.. వాలంటీర్లను గౌరవించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.
మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలు ఎమ్మెల్యే తిరగాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలి.. ఆ సచివాలయంలో ప్రతి ఇంటికీ తిరగాలి.. ఆ ఇంట్లో జరిగిన మేలేంటి? ప్రతి కుటుంబానికి జరిగిన మేలుపై ముఖ్యమంత్రిగారి రాసిన లేఖను అందించాలని.. వారి ఆశీస్సులను పొందాలని తెలిపారు.. ఈ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలి.. క్యాడర్‌తో మీరు మమేకం కావాలి.. మళ్లీ బేసిక్స్‌లోకి వెళ్లి బూత్ కమిటీల ఏర్పాటు కూడా జరగాలని.. బూత్ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలని.. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగానలి స్పష్టం చేశారు.. వేరే సచివాలయానికి వెళ్లేముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని తెలిపిన ఆయన.. నియోజకవర్గంలో డోర్–టు డోర్ పూర్తికావడానికి కనీసం 8 నెలలు పడుతుందని.. 8 నెలలు అయ్యేసరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్తారని.. ఆ కుటుంబాల ఆశీర్వాదాలు తీసుకుంటారని వెల్లడించారు. మేలో సచివాలయాల సందర్శన ప్రారంభమయ్యే సరికి, జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు కావాలని స్పష్టం చేసిన ఏపీ సీఎం.. ఏప్రిల్ నాటికి కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలి.. ఈ కమిటీల ఏర్పాటులో రీజినల్ కో–ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారని.. 3–4 జిల్లాలకు రీజినల్ కో–ఆర్డినేటర్లు ఉంటారని.. కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని రీజినల్ కో–ఆర్డినేటర్లను నియమిస్తామన్నారు.. ఇక, జులై 8న ప్లీనరీ నిర్వహిస్తాం.. ఇలా ఒకవైపున పార్టీ నిర్మాణం సాగుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!