CM YS Jagan: ‘సోషల్ మీడియా’ వేధింపులపై ప్రత్యేక విభాగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: హోంశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్న ఆయన.. దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.. ఇక, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేశారు.. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలన్న ఆయన.. దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు..
Read Also: Solar Maximum: “సోలార్ మాగ్జిమమ్”.. సూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదమా..?
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
మరోవైపు.. దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలని సూచించారు సీఎం జగన్.. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై మరోసారి పరిశీలన చేయాలన్నారు.. ఇక, దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలని వెల్లడించారు. మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించాలని ఆదేశించారు.. మాదకద్రవ్యాల రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని పేర్కొన్న ఆయన.. డ్రగ్ పెడలర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలన్నారు.. ఇక, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్‌స్టేషన్ ఉండాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హోం శాఖపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!