కరోనా విజృంభన నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ వేయడంపై ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు తెరిచే ముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్ల అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్టి డిగ్రీ విద్యార్ధులకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని… ఆయా కాలేజీల్లోనే క్యాంపులు పెట్టి వాక్సిన్ ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
read also : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరోనా !
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కరోనా యేతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని… పీహెచ్‌సీల వారీగా సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాము కాట్లు పెరిగే అవకాశాలున్నాయని.. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. వాటికి సంబంధించి ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచాలని.. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ వంటి వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉందన్నారు. వాటికి సంబంధించిన మందులు పీహెచ్‌సీల్లో, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయో ? లేదా ? చూసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.