CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైళ్ల క్లియరెన్స్ స్పీడ్ గా జరగాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీఎస్డీపీ గ్రోత్ బాగా పెరగాలి.. ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలి.. రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి ఇంటలిజెన్స్ ఉంది.. వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని సర్వీసులు ఉండాలి అని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్థిక సంబంధం లేని సమస్యలు పరిష్కరించాలి.. డబ్బులు లేవని పనులు ఆపొద్దని పేర్కొన్నారు. కార్యదర్శులు అప్పుడప్పుడు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పారు. అధికారులు అందరూ గ్రామాల్లో పర్యటనలు చెయ్యాలి.. వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి అన్నారు. ఉగాది రోజు పీ4 ప్రారంభం అవుతుంది.. హ్యాపీ సండే ప్రోగ్రాం కూడా త్వరలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: IPL 2025: ఐపీఎల్‌కి ముందు భారీ మార్పు.. మారనున్న ఆ జట్టు యజమాని..!
అలాగే, డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు సీఎం చంద్రబాబు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, 22 వేల కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రం బాధల్లో ఉన్న ముందుకు వెళ్తున్నాం.. బకాయిలు చెల్లిస్తున్నాం అన్నారు. ఇక, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలోని రోడ్లపై గుంతలు కనిపించకూడదు అని సూచనలు చేశారు. నాలుగేళ్లలో రహదారులు మొత్తం బాగు పడాలి.. గతంలో రోడ్లపై వెళ్లాలంటే భయం వేసేది.. త్వరలో గుంతలు రహితంగా రోడ్లు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు.
Read Also: Swati Maliwal: దోపిడీ కోసం కేజ్రీవాల్ తన ‘‘గుండా’’ని పంజాబ్ పంపాడు..
ఇక, చిలూకురు బాలాజీ ఆలయంలోని ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ పై జరిగిన దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని దారుణ సంఘటనగా పేర్కొన్నారు. నాగరిక సమాజంలో పరస్పర గౌరవంతో కూడిన సంభాషణకు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి అని పేర్కొన్నారు. హింసకు ఎప్పుడూ తావుండకూడదు అని చెప్పుకొచ్చారు. ఈ దాడిని ఖచ్చితంగా తిరస్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.