CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- ఏపీలో హీట్‌వేవ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
- వడగాల్పుల నుంచి రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం
- టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలన్న సీఎం చంద్రబాబు
- తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు నిప్పుల కుంపటిలా మారాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పుల (Heat Waves) నేపథ్యంలో చంద్రబాబు గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రజలను ఈ ప్రచండ భానుడి సెగల నుంచి కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఒక హై-లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో లోకల్ హాలిడేస్ (స్థానిక సెలవులు) ప్రకటించేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. గవర్నమెంట్ ఆఫీసులకు స్థానికంగా సెలవులు ఇవ్వాలా? లేక టైమింగ్స్ మార్చాలా? ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనే దానిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ రివ్యూ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చారు. తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రతి ఊరిలో, పట్టణాల్లోని మెయిన్ సెంటర్లలో టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోసం చల్లని తాగునీరు, మజ్జిగ, అలాగే వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.
Also Read
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎండల తీవ్రతపై ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అవేర్నెస్ కల్పించడానికి జిల్లా కలెక్టర్లందరూ ప్రెస్ మీట్స్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు డైరెక్ట్ చేశారు. వాతావరణ హెచ్చరికలను బట్టి ప్రజలను అలర్ట్ చేయాలని చెప్పారు. అమరావతిలో జరిగిన ఈ ఇంపార్టెంట్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్‌తో పాటు విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల టాప్ అఫీషియల్స్ పాల్గొన్నారు. ప్రజలు కూడా మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..