NTV Telugu Site icon

Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు..

Baboru

Baboru

Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్.. కేంద్రం నుంచి ఏయే స్కీములు, ప్రాజెక్టులను రాబట్టొచ్చనే అంశంపై ప్రధానంగా చర్చ జరిపారు. మౌళిక వసతులకు వీలైనన్ని నిధుల రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు సీఎం చంద్రబాబు.

Read Also: Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి

ఇక, గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రొత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విఙప్తి చేయనున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆర్థిక సాయం లాంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోం మంత్రి సహా వివిధ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నితీన్ గడ్కరి, జేపీ నడ్డా, సీఆర్ పాటిల్ లాంటి కేంద్రలమంత్రులతో చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు వెళ్లనున్నారు.