NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం కీలక ప్రకటన.. డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు

Chandrababu

Chandrababu

కర్నూలు జిల్లా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1995లో చంద్రబాబును చూపించాలనుకుంటున్నా.. మొన్నటి వరకు సీఎంగా ఉన్న వ్యక్తి జలజలా మొత్తం పీల్చేశారని ఆరోపించారు. తన జీవితంలో ఎందరినో చూసానని.. ఇలాంటి వ్యక్తిని చూడలేదని దుయ్యబట్టారు.

Read Also: Alluri Sitaramaraju District: బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు

ఆ మాజీ సీఎం ఎస్కో బార్.. కొలంబియాలో స్మగ్లర్ లాంటి వాడని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 93 శాతం ఎమ్మెల్యే అభ్యర్థులను, 21 మంది ఎంపీలను గెలిపించారు.. అదే తమకు సంజీవని అన్నారు. 21 మందిని గెలిపించకుండా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు తాను అండగా ఉంటానని చెప్పారు. అలాగే.. అన్ని చెరువులకు హంద్రీ నీవా నీరు ఇవ్వాలని ఆలోచించాను.. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నాం.. వైసీపీ ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి వేయలేదని ఆరోపించారు. అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ముఖ్యమంత్రి తెలిపారు.

Read Also: AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!