భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కారు దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక వ్యక్తి తన ఎయిర్‌పాడ్‌ల సహాయంతో రూ. 5 కోట్ల విలువైన తన ఫెరారీ కారును కనుగొన్నాడు. ఆపిల్ కి చెందిన ఈ ఎయిర్‌పాడ్ కారు యజమానికి చాలా సహాయం చేసింది. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం..
READ MORE: Rajinikanth: రజనీకాంత్ డిశ్చార్జ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే?
ఆపిల్ ఫైండ్ మై (Apple Find My) ఫీచర్ సహాయంతో.. చాలా మంది వారి ఐఫోన్ (iPhone), ఎయిర్‌పాడ్ (AirPod)లు, ఇతర గాడ్జెట్‌లను కనుగొని ఉండవచ్చు.
ఓ వ్యక్తి తన సరికొత్త ఫెరారీ కారును లండన్‌లోని గ్రీన్‌విచ్‌లో పార్క్ చేశాడు. ఈ సమయంలో అతను అనుకోకుండా తన ఎయిర్‌పాడ్‌లను తన కారులో మర్చిపోయాడు. ఇదే ఆయనకు వరంగా మారింది. తన కారును ఎవరో దొంగతనం చేశారు. దీంతో బాధితుడికి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు అతడు తన ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ను కారులోనే మర్చిపోయిన సంగతి గ్రహించాడు. వెంటనే ఆపిల్ ఫైండ్ మై ఫీచర్ సాయంతో ట్రేజ్ చేశాడు. సిగ్నల్స్ అందాయి. దీని తరువాత, బాధితుడు వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. తన ఫెరారీ కారు కారు పోయిన విషయాన్ని చెప్పి.. సిగ్నల్ వివరాలు అందించాడు.
READ MORE:CM Chandrababu: సీఎం కీలక ప్రకటన.. డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు
వెంటనే యాక్షన్ లోకి దిగిన పోలీసులు ఆ లొకేషన్ లోకి వెళ్లి కారును స్వాధీనం చేసుకుని ఓనర్ కు అందించారు. దొంగతనం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత కారు యజమాని ఎయిర్‌పాడ్స్ తయారీ కంపెనీ ఆపిల్ కి ధన్యవాదాలు తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఆపిల్ టెక్నాలజీని ఉపయోగించి ఎవరైనా తమ పోయిన వస్తువును కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇది కాకుండా, అనేక ఆపిల్ ఉత్పత్తులు తమ వినియోగదారుల ప్రాణాలను రక్షించడంలో కూడా సహాయపడ్డాయి.