NTV Telugu Site icon

CM Chandrababu: సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Chandranna

Chandranna

CM Chandrababu: సివిల్ సప్లైస్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధరల నియంత్రణకు వీలైనన్ని మార్గాలు అన్వేషించాలన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడం మంచి పరిణామమన్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల తర్వాత రైతులకు వీలైనంత త్వరగా డబ్బులు చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేషన్ అక్రమాలపై సమీక్షించారు. కాకినాడ కేంద్రంగా ద్వారంపూడి ఫ్యామ్లీ చేపట్టిన రేషన్ అక్రమాల కేసు పురోగతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

Read Also: Minister Narayana: అమరావతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

అలాగే, ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. నెల రోజుల్లోగా అన్ని మద్యం దుకాణాల వద్దా డిజిటల్ పేమెంట్ల కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సీఐడీ విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్‌ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..

కొత్త మద్యం విధానంపై అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకూ ట్రాక్ అండ్ ట్రేస్ పాలసీ తేవాలని సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మద్యం సేకరణకు సంబంధించి కొత్తగా ప్రోక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అన్ని ప్రముఖ బ్రాండ్లకు మార్కెట్లో అవకాశం ఉండేలా ప్రొక్యూర్ మెంట్ పాలసీ తెచ్చేందుకు యోచిస్తున్నామన్నారు. మద్యం నాణ్యత పైనా కొత్త విధానం తీసుకురావాలన్నారు. బీఐఎస్ తో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నాణ్యతా ప్రమాణాలు ఉండేలా ఐదు టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.