Kurasala Kannababu: చంద్రబాబు ఒక కాపీ నేత.. ఎక్కడైనా ఒక బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని ఇది నాదేనని చెప్పుకోవటంలో దిట్ట అని వైసీపీ మాజీమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం.. వైసీపీ రైతు భరోసా పథకానికి కాపీ.. రైతులను అప్పుల కోసం తిరగొద్దనే లక్ష్యంతో రైతు భరోసా పథకం తెచ్చిన జగన్.. గతంలో చంద్రబాబు హయాంలో ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం అలవాటు అయింది. కానీ, జగన్ ఇచ్చిన.. ఇవ్వని హామీలు కూడా అమలు చేశారని పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పథకం- పీఎం కిసాన్ కు అదనమని చెబుతున్నారు.. తొలి ఏడాది రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాజీమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
Read Also: Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?
అయితే, గత వైసీపీ హయంలో 53 లక్షల మందికి పథకాన్ని అమలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం 7 లక్షల మందికి ఎగ్గొట్టారు అని మాజీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 7 లక్షల మందికి తగ్గటమంటే రాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు.. లేకుంటే వలస వెళ్లారు.. వాళ్లకు వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదా.. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా.. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 53 లక్షల మందికి 34 వేల కోట్లకు పైగా ఇచ్చారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు 40 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Botsa Satyanarayana: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..
ఇక, ఇప్పటి వరకు రూ. 4,685 కోట్లు మాత్రమే ఇచ్చారని కురసాల కన్నబాబు తెలిపారు. ఇవ్వాల్సిన దాని కన్నా ఇంచుమించి 17 వేలకోట్లు కోత పెట్టారు.. కూటమి ప్రభుత్వం రైతులకు మొత్తం 16,746 కోట్లు బాకీ పడింది.. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసిన ఘటన జగన్ కి దక్కింది.. భూ యజమాని హక్కులు కాపాడుతూ సీసీఆర్సీ కార్డులు తీసుకువచ్చాం.. ఇప్పుడు కౌలు రైతులకు ఈ పథకం వర్తింపజేయలేదు.. రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు.. అన్నీ సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతులకు అందించిన ఘనత ఒక్క జగన్ దే.. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లుగా వారిని కౌలు రైతులను చంద్రబాబు వదిలేశారని వైసీపీ నేత కన్నబాబు అన్నారు.