Vijayawada: బెజవాడలో సంచళనంగా మారిన దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో చౌడేష్ తోపాటు మరో ముగ్గురు వున్నట్లు.. అందరూ మద్యం సేవించనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే కారును నడుపుతూ సురేష్ ని ఢీకొట్టి చౌడేష్ అనే వ్యక్తం హత్య చేసినట్లు నిర్థారించారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నారు. హత్యకు వాడిన ఐ 20 కారు సీజ్ చేశారు. మృతుడు సురేష్, నిందితుడు చౌడీష్ మధ్య 2020లో వివాదం వుందని, బ్యానర్లు కట్టే విషయంలో చౌదేష్ పై సురేష్ చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వున్నాయి. అయితే దీనిపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కక్ష పెంచుకుని సురేష్ ని చౌడేష్ కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు నిర్థారించారు.
అయితే మృతిడి సురేష్ భార్య శివాణి ఎన్టీవీతో మాట్లాడుతూ.. కొడుకుకి ఐస్ క్రీమ్ తెస్తానని వెళ్ళి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడని భావోద్వేగానికి గురైంది. పాత కక్షలతో హత్య చేసి.. నాబ్రతుకు రోడ్డు పాలు చేసాడు అని వాపోయింది. కోపం ఉంటే కొట్టాలి కానీ హత్య ఎందుకు చెయ్యాలి? అని ప్రశ్నించింది. తన బిడ్డను.. ఎలా పోషించుకోవాలి, నేను ఎలా బ్రతకాలి అంటూ కన్నీరుమున్నీరైంది. వాళ్ళిచ్చే నష్టపరిహారం నాకొద్దు.. నా భర్త ఉంటే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తాడంటూ తెలిపింది. హత్యకు కారణం చెప్పి చంపినా అతనికి కఠిన శిక్ష వెయ్యాలని కోరింది.
అయితే.. మాచవరం పోలిస్ స్టేషన్ పరిధిలో అమ్మా కళ్యాణ మండపం నుండి క్రీస్తు రాజు పురం వైపు వెళుతూన్న దేశీ సురేశ్ అనే వ్యక్తిని కారుతో గుద్ది కంకణాల చౌడేస్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వైస్సార్సీపీ కార్యకర్తలుగా బ్యానర్స్ విషయంలో కొద్దీ రోజుల క్రితం ఇరువురికి గొడవకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో సురేష్ ను చౌడేష్ కారుతో గుద్ది పోలీసులకు చౌడేష్ లొంగిపోయాడు. పోలీసులు ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MK Stalin: మరోసారి డీఎంకే అధినేతగా స్టాలిన్.. ఏకగ్రీవంగా ఎన్నిక