తన రాజీనామాపై వస్తున్న విమర్శల పట్ల ఘాటుగా స్పందించారు చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. నా రాజీనామాలో చిత్త శుద్ధి ఉంది….నా నిర్ణయంలో తిరుగు లేదు….ఇప్పటికే స్పీకర్ తో మాట్లాడాను…రాజీనామా లేఖ ఫార్మాట్లో పంపిస్తాను ఆమోదించమని కోరానన్నారు ధర్మశ్రీ. ఎవరిది డ్రామానో….ఎవరిది ఆవేదనో తేలిపోవాలంటే ఉత్తరాంధ్రలో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలన్నారు. ధైర్యం ఉంటే అచ్చెన్నాయుడు నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. ఎన్నికలకు వెళ్లి ప్రజా క్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం అన్నారు.
ఉత్తరాంధ్ర నాయకత్వం మనోభావాలంటే టీడీపీకి వేళా కోళంగా కనిపిస్తోంది. టీడీపీ కోమాలో ఉన్న పార్టీ…ప్రజల అభిలాషను గౌరవించలేని స్థితిలో ఉంది. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో MLA కరణం ధర్మ శ్రీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో మహా పాదయాత్రకు జిల్లా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. రేపటినుంచి ప్రతీ నియోజకవర్గంలో వికేంద్రీకణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతీ నియోజకవర్గంలో జే.ఏ.సీ లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు కరణం ధర్మశ్రీ.
Read Also: Nayan- Vignesh: బిగ్ బ్రేకింగ్.. కవల పిల్లలకు తల్లి అయిన నయనతార
వికేంద్రీకరణకు మద్దతుగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి. ఉత్తరాంధ్రలో వున్న జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలపాలి. ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వికేంద్రీకరణకు మద్దతు తెలపాలి. నా రాజీనామా పై కొందరు చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు.
Read Also: Karanam Dharmasri: రాజీనామా లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. మీకు దమ్ముందా..?