Site icon NTV Telugu

Chittoor Gang-Rape: చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితుల ఊరేగింపు.. కోర్టు వరకు నడిపిస్తూ..

Tpt

Tpt

Chittoor Gang-Rape: చిత్తూరు జిల్లాలో గత నెల 25వ తేదీనా జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ లను గుడిపల్లె దగ్గర అరెస్ట్ చేశారు. అయితే, ఈ ముగ్గురు నిందితులు ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే, వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగదు తీసుకుని వేధించేవారు.. అలా గత సెప్టెంబర్ 25వ తేదీనా ఓ ప్రేమ జంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక, తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు‌. కాగా, గ్రామస్థులు అప్పటికే ముగ్గుర్ని పట్టుకుని దేహశుద్ది చేశారు.

Read Also: China: షాకింగ్ తీర్పు.. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి మరణశిక్ష..

ఇక, తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాటు బాలిక వాంగ్మూలం మేరకు నిందితులపై పోక్సో యాక్ట్, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ , రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1 మహేష్ పై గతంలో మైనర్ బాలికను వేధించిన ఘటనపై కేసు నమోదు అయింది. గతంలో పాల్పడిన ఘటనకు సంబంధించి ఐదు వీడియోలను పోలీసులు గుర్తించారు. మరోవైపు, చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు ఊరేగించారు. ఈ సందర్భంగా వారిని కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. అలా, ఈ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీస్తుకెళ్తుంటే.. స్థానికులు పెద్ద ఎత్తున నిలబడి వారిని చూశారు.

Exit mobile version