సంక్రాంతి వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాలిపటం ఎగరవేత విషాదాన్ని నింపింది. చంద్రగిరి పట్టణం బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు మరో బాలుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.