AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: చిత్తూరు జిల్లా కుప్పం మండలం వానగుట్టపల్లిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సర్పంచ్ అభ్యర్థి గెలుపు విషయంలో ఇరువర్గాల మధ్య మొదలైన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల రూట్లో ఉన్న వాహనం ఘర్షణ పడుతున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
25 ఓట్ల మెజారిటీతో గెలుపు.. డిక్లరేషన్‌పై వివాదం
వానగుట్టపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడైన బసవరాజు 25 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇక, ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో ఎన్నికల రూట్ వాహనం ఒక్కసారిగా అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు పది మందిని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. రాజేంద్ర అనే వ్యక్తిని వానగుట్టపల్లి నుంచి జిటారు మడుగు వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది.
Also Read
- Chittoor Municipal Corporation: చిత్తూరు కార్పొరేషన్లో ట్విస్ట్.. ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ కార్పొరేటర్ రాజీనామా
- AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
- Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
- RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు
ఈ ఘటన అనంతరం వానగుట్టపల్లిలో ఉద్రిక్తత మరింత పెరిగింది. కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు రాజగోపాల్, కుప్పం జడ్పీటీసీ స్వాతి ఇళ్లపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కౌంటింగ్ ముగిసిన తర్వాత రాజగోపాల్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఒకవైపు ఎన్నికల గెలుపు వివాదం, మరోవైపు వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి, టీడీపీ నేతల ఇళ్లపై దాడులతో వానగుట్టపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మొదలైన వివాదం చివరకు ప్రాణనష్టం, దాడులకు దారితీయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!