RK Roja: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. మూడు రోజులు అయ్యింది, ఎందుకు పట్టించు కోవడం లేదు? సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీతో సహా అందరిపై కేసు నమోదు చేయాలన్నారు.. ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి ఇంకా బుద్ధిరాలేదన్న ఆమె.. దీనికి కారణమైన వారిని ఇంకా కాపాడాలి అని చూస్తున్నారు.. హిందువులు అనే గౌరవం లేదా? భక్తులు ప్రాణాలకు విలువ లేదా? అని నిలదీశారు.
Read Also: Kerala: కేరళలో దారుణం.. టీనేజర్‌పై 64 మంది లైంగిక వేధింపులు..
6 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు.. ఈ ఘటనలో మొదటి ముద్దాయిగా సీఎం చంద్రబాబు నాయుడును చేర్చాలని డిమాండ్ చేశారు రోజా.. 6, 7, 8 తేదీల్లో కుప్పంలో సీఎం పర్యటన చేశారు.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన హత్యగా భావించాలని పేర్కొన్నారు.. స్వర్ణకుప్పం, కుప్పం విజన్ 2029 అన్నారు.. 14 ఏళ్లు సీఎం అప్పుడు కుప్పం అభివృద్ధి ఏం అయ్యింది అని ప్రశ్నించారు.. నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కుప్పం వచ్చారు.. అధికారులను నీ చుట్టూ తిప్పుకున్నారు.. వైకుంఠ ఏకాదశి లక్షలాది భక్తులు వస్తారని మీకు తెలియదా? మీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యింది.. మరి టోకెన్ సిస్టం ఎందుకు తీయలేదు అని ప్రశ్నించిన ఆమె.. డైవర్ట్ చేసి టోకెన్ సిస్టంపై పక్క దారి పట్టిస్తున్నారని విమర్శించారు.. మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న డిప్యూటీ సీఎం తిడుతున్నారు.. పవన్ కల్యాణ్ వాఖ్యలు ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నాయన్నారు.
Read Also: VFX : ‘కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ’ సర్వీసెస్ ను ప్రారంభించిన దర్శకులు శ్రీను వైట్ల
తప్పు చేసిన వారికి శిక్షపడాలి.. తప్పు చేసిన వాళ్ళు ఎస్పీ, ఈవో, అడిషనల్ ఈవో అని మీరే చెప్తున్నారు.. వాళ్ళ తాట ఎందుకు తీయడం లేదు అని సీఎంని నిలదీశారు రోజా.. నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ను తిడితే మీరు ఏం చేశారు.. చేయని తప్పుకు లడ్డు విషయం లో కషాయం కప్పుకుని మాట్లాడారు.. ఇప్పుడు ఏమయ్యారు.. ఒక్కరూ చనిపోతే 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు.. మరోవైపు.. అల్లు అర్జున్ కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.. గేమ్‌చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించలేదని విమర్శించారు. ఆరు మంది చనిపోతే, 60 మంది హిందువులు గాయపడితే చిన్నమ్మ పురంధేశ్వరి నోరు విప్పదు. నీతి మాలిన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మాట్లాడుతున్నారు.. దిగజారుడు గా మంత్రి ఆనం వాఖ్యలు ఉన్నాయి.. ప్రజలే మీకు బడిత పూజ చేస్తారు అని హెచ్చరించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..