Katari Couple Murder Case: చిత్తూరు మాజీ మేయర్ కఠారీ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు ఈ రోజు ( అక్టోబర్ 31న) మరణ శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు.
Read Also: Online Fruad: ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా..
అయితే, ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత A1 నుంచి A5గా ఉన్న ఐదుగురు నిందితులు చింటూ, వెంకటచలపతి, జయప్రకాశ్ రెడ్డి, వెంకటేశ్, మంజునాథ్ లకు ఉరి శిక్ష విధిస్తున్నట్లుగా చిత్తూరు కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, కేసులో A6 నుంచి A23 వరకు ఉన్న నిందితులపై ఉన్న కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్లు మరో 6 నెలల పాటు అమల్లో ఉండాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.