అమరావతిపై రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టాం: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు ప్రీమియం కంపెనీల బ్రాండ్లను అమ్ముతామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పన్నుల పేరుతో ప్రజలను ఈ ప్రభుత్వం దోచుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. చివరకు చెత్తపైన కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇటీవల రాష్ట్రంలో గంజాయి సరఫరా ఎక్కువ కావడంతో డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇతర రాష్ట్రాలు అవమానించే పరిస్థితి నెలకొందన్నారు.
మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 4వ తేదీ వస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీకి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు కూడా భయపడుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపి ఎన్నికలు అయ్యాక జగన్ మాట మార్చారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై తాము రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టామని.. అమరావతిలో భవనాలన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారిపోయాయన్నారు. అమరావతిని విధ్వంసం చేయడం ద్వారా రూ. 2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని మండిపడ్డారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
పోలవరంపై కాలయాపన చేసి రేట్లు పెంచారని… పోలవరం అసలు పూర్తవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయని… జాబ్‌లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను నిరుద్యోగుల పాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని.. బిల్లులు మంజూరు చేయకపోవడంతో రోడ్ల మరమ్మతులకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన వైసీపీ పరిపాలన… ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారని చంద్రబాబు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!